ఉద్యోగుల డిమాండ్లను అసెంబ్లీలో ప్రస్తావిస్తా - ఎమ్మెల్యే ధన్ పాల్
ఉద్యోగులంతా న్యాయమైన డిమాండ్లను కోరుతున్నారని, వారికి పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు. ఇంక్రిమెంట్లతో పాటు బోనస్ కూడా ప్రకటించాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగి మరణిస్తే ఇన్సూరెన్స్ తో పాటు కుటుంబంలో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎన్హెచ్ఎం సిబ్బంది ధర్నాకు మద్దతు ప్రకటించిన అర్బన్ ఎమ్మెల్యే
ఇంక్రిమెంట్, బోనస్, ఇన్సూరెన్స్ డిమాండ్లకు పూర్తి మద్దతు
తాజ్ / నిజామాబాద్, 15 అక్టోబర్: ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.
నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కొనసాగుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నాకు గురువారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేసినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.
ఉద్యోగులంతా న్యాయమైన డిమాండ్లను కోరుతున్నారని, వారికి పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు. ఇంక్రిమెంట్లతో పాటు బోనస్ కూడా ప్రకటించాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగి మరణిస్తే ఇన్సూరెన్స్ తో పాటు కుటుంబంలో ఒకరికి విద్యార్హతను బట్టి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో ఎన్హెచ్ఎం జిల్లా అధ్యక్షులు సందీప్, నారాయణ, అక్షయ్, విశాల తదితరులు పాల్గొన్నారు.





Post a Comment