మచ్చేందర్ కు కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష
ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ఆశీర్వదించిన స్వామిజీ
కామారెడ్డి, నవంబర్ 6: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కల్కి నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజీ దర్శించుకున్నారు. అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజీ మాట్లాడుతూ మచ్చేందర్ తన సొంత ఖర్చులతో స్థలాన్ని కొని కోటిలింగేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. వారికి సాక్షాత్తు కాశీ విశ్వనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసే ధైర్యాన్ని కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మచ్చేందర్ కుటుంబ సభ్యులు, వివిధ ఆలయాల బ్రాహ్మణ అర్చకులు పాల్గొన్నారు.

Post a Comment