Congress Leaders | చికిత్స పొందుతున్న నాటు బాంబు బాధితులపై ఎమ్మెల్యే పోచారం ఆరా

దుబ్బలో నాటు బాంబు ప్రమాద బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు ఏజాస్, గంగాధర్ 

ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ - మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన

నిజామాబాద్, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితులపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరా

బాన్సువాడ, నవంబర్ 2: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని దుబ్బలో నిన్న ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడిన బాధితులను మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ ఎంపీపీ మహమ్మద్ ఏజాజ్, 17వ వార్డు నాయకులు మహమ్మద్ రఫీక్ పరామర్శించారు.

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అలాగే తీవ్ర గాయాలతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో,  హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మిగతా బాధితుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని ఈ సందర్భంగా తెలియజేశారు.



Post a Comment

Previous Post Next Post