కనీస వేతనాల సవరణ - జూన్ 1, 2026 నుండి అమలు - కార్మికులకు శుభవార్త
కామారెడ్డి జిల్లాలో అన్ని రంగాల్లో పెరిగిన వేతనాలు - తెలంగాణ ప్రభుత్వ గెజిట్ విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కార్మికుడికి రూ.14,000, కార్పొరేషన్ పరిధిలో రూ.16,000
కామారెడ్డి, నవంబర్ 3: తెలంగాణ ప్రభుత్వం సవరించిన కనీస వేతనాలు జూన్ 1, 2026 నుండి కామారెడ్డి జిల్లాలో అమల్లోకి వచ్చినట్లు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ డా. ఎం. శశి కుమార్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
G.O.Ms.No.6 LET & F డిపార్ట్మెంట్, తేదీ 30.05.2026 (తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్ నెం. 111-A, తేదీ 01.06.2026) మరియు లేబర్ కమిషనర్ సర్క్యులర్ మెమో నెం. H1/MW/22/2024, తేదీ 24.10.2026 ప్రకారం ఈ వేతనాలు అమలు చేయాలి.
లక్ష్యం: జిల్లాలోని అన్ని వర్గ, వాణిజ్య, పారిశ్రామిక మరియు నిర్మాణ ప్రదేశాలలో సవరించిన వేతనాలు అమలయ్యేలా చూడటం మరియు విస్తృత ప్రచారం కల్పించడం.
ముఖ్యాంశాలు:
- కార్మికులను 4 నైపుణ్యాలుగా, పని ప్రాంతాలను 3 జోన్లుగా వర్గీకరించారు.
- జోన్-I: మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-II: మున్సిపాలిటీలు, జోన్-III: గ్రామీణ & ఇతర ప్రాంతాలు
- ఏ ఉపాధిలోనైనా కార్మికుడికి చెల్లించాల్సిన అతి తక్కువ కనీస వేతనం గ్రామాల్లో అయితే నైపుణ్యం లేని కార్మికునికి రూ.14,000, మున్సిపాలిటీలో రూ.15,000, కార్పొరేషన్లో రూ.16,000 (01.06.2026 నుండి జారీ)
- మిగతా వారికి వారి నైపుణ్య స్థాయి ఆధారంగా జోన్ ఆధారంగా చెల్లించాలి
అమలు పరిధి: జిల్లాలోని అన్ని దుకాణాలు, వర్తక సంస్థలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, బిల్డింగ్ వర్కింగ్ సైట్లు మొదలైనవి.
యాజమాన్యాల బాధ్యత: ప్రతి యజమాని తమ కార్మికులకు కేటగిరీ & జోన్ ప్రకారం వేతనాలు చెల్లించాలి మరియు కనీస వేతనాల పట్టికను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి.
చట్టపరమైన చర్యలు: కనీస వేతనం (గ్రామీణ ప్రాంతాల్లో రూ.14,000) చెల్లించని యాజమాన్యాలపై 'కోడ్ ఆన్ వేజెస్ 2019' మరియు సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు మరియు ప్రాసిక్యూషన్ తీసుకోబడుతుంది.
కనీస వేతనాల పట్టిక:
నైపుణ్య వర్గం జోన్ - I (మున్సిపల్ కార్పొరేషన్లు) జోన్ - II (మున్సిపాలిటీలు) జోన్ - III (గ్రామీణ & ఇతర ప్రాంతాలు)
అన్-స్కిల్డ్ Rs. 16,000/- Rs. 15,000/- Rs. 14,000/-
సెమీ-స్కిల్డ్ Rs. 17,000/- Rs. 16,000/- Rs. 15,000/-
స్కిల్డ్ Rs. 18,500/- Rs. 17,500/- Rs. 16,500/-
హైలీ స్కిల్డ్ Rs. 20,000/- Rs. 19,000/- Rs. 18,000/-

Post a Comment