అమిత్ షా మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ధన్ పాల్
అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం - వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఖాయం - ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, నవంబర్ 2: హైదరాబాద్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం చేపట్టిన మహా పాదయాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
నిజాం కళాశాల నుంచి మోజాంజాహీ మార్కెట్ వరకు అమిత్ షాతో కలిసి నడిచి, అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి రావడంతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం ఉరకలెత్తిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఎస్ఐఆర్పై రాహుల్ గాంధీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టేందుకే అమిత్ షా భాగ్యనగరానికి విచ్చేశారన్నారు.

Post a Comment