MLA PSR | చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి - వైద్యులకు ఎమ్మెల్యే పోచారం ఆదేశం

నిలోఫర్ ఆసుపత్రిలో నాటు బాంబుల పేలుడు బాధిత చిన్నారులను పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి

తాడ్కోల్ ఎర్రమన్ను కుచ్చ ప్రమాదంలో గాయపడిన దండ్ల అంజలి, శ్రీదేవిలకు పరామర్శ

చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి - వైద్యులకు ఎమ్మెల్యే పోచారం ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 2: బాన్సువాడ మండలం తాడ్కోల్ శివారు ఎర్రమన్ను కుచ్చలో ఆదివారం పందుల వేట పేలుడు పదార్థాలు ప్రమాదవశాత్తు పేలి ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు చిన్నారులను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

 

ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న చిన్నారులు దండ్ల అంజలి (3 ఏళ్లు), దండ్ల శ్రీదేవి (5 ఏళ్లు)లను పరామర్శించారు.

చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆయన వెంట నిలోఫర్ ఆసుపత్రి ఆర్ఎంఓ, సూపరింటెండెంట్, తాడ్కోల్ సర్పంచ్ రమేష్, మాజీ జడ్పీటీసీ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీడియో 👇👇




Post a Comment

Previous Post Next Post