వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా - మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచన
వైద్య సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలపై డీసీహెచ్ఓతో చర్చ
వర్ని, నవంబర్ 3: వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సందర్శించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనే విషయంపై వైద్యులను ఆరా తీశారు.
అనంతరం డీసీహెచ్ఓ శ్రీనివాస్ ప్రసాద్ తో మాట్లాడి, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, అవసరమైన సిబ్బంది నియామకం, రావాల్సిన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి చర్చించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.






Post a Comment