బాన్సువాడలో శ్రీ బాలాజీ ఖుష్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం
తాడ్కోల్ రోడ్డులో నూతన బేకరీకి ప్రజాప్రతినిధుల శుభాకాంక్షలు
నాణ్యమైన స్వీట్లు, బేకరీ వంటకాలు అందించాలని ఆకాంక్ష
బాన్సువాడ, నవంబర్ 5: బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ ఎదురుగా శ్రీ బాలాజీ ఖుష్ స్వీట్స్ అండ్ బేకరీ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 13వ వార్డు కౌన్సిలర్ కాలేక్ , కో-ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ సీనియర్ నాయకులు షేక్ అక్బర్, మాజీ వార్డు సభ్యుడు బాడీ శ్రీను, 13వ వార్డు మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 13వ వార్డు వాసు కాలనీకి చెందిన దాము ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు హోటల్ యజమాని దాముకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
పట్టణంలో నూతనంగా ఏర్పాటైన ఈ బేకరీ ద్వారా ప్రజలకు నాణ్యమైన, తాజా స్వీట్లు, బేకరీ వంటకాలు అందుబాటులోకి వస్తాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపార వర్గాలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment