Attack on Trump | ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్ వద్ద కాల్పులు

 


ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్ వద్ద కాల్పులు

(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)

అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 

కాల్పులు జరిగింది ఇతనే 👆


వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఘటన 

ఏప్రిల్ 25, 2026 శనివారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ (WHCA Dinner)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. 

డిన్నర్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో భయానక పరిస్థితి నెలకొంది. హాల్‌లో ఉన్నవారంతా బల్లల కిందకు ఒదిగిపోయిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

(videos👇)





ట్రంప్, జేడీ వాన్స్ సేఫ్  

అత్యున్నత స్థాయి భద్రతా బృందాలు తక్షణం స్పందించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, ఫస్ట్ లేడీని, ఇతర అధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ట్రంప్, జేడీ వాన్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదని నివేదికలు చెబుతున్నాయి. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.

ట్రంప్ స్పందన 

ట్రంప్ తన స్టేట్‌మెంట్‌లో సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల పనితీరును ప్రశంసించారు. "ప్రశాంతమైన సాయంత్రం. సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అద్భుతంగా పనిచేశారు. వారు వెంటనే, ధైర్యంగా చర్యలు చేపట్టారు" అని ట్రంప్ మెచ్చుకున్నారు

ఏప్రిల్ 25 రాత్రి జరిగిన ఈ ఘటనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గతంలో బహిష్కరించిన డిన్నర్‌కు హాజరు  

ఈ ఈవెంట్‌లో ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో పాల్గొనలేదు. గతంలో ఈ డిన్నర్‌ను బహిష్కరించిన ట్రంప్ ఈ సారి హాజరై మాట్లాడాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ అనుమానాస్పద ఘటన జరిగింది.

ANI వార్తా సంస్థ ప్రకారం, "US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event." (Source: Unrestricted Pool via Reuters)

అమెరికా రాజకీయాల్లో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

ట్రంప్‌పై కాల్పుల ఘటన : అదే హోటల్‌లో కేఏ పాల్*

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో దుండగుడు కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

*కీలక నేతల తరలింపు*  

వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.

*అదే హోటల్‌లో కేఏ పాల్*  

కాల్పులు జరిగిన సమయంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో బస చేసినట్లు తెలిసింది. ఘటనపై ఆయన స్పందిస్తూ, "నేను అమెరికా వచ్చిన ప్రతిసారీ ఇదే హోటల్‌లో బస చేస్తాను. నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు" అని అన్నారు.

*"యుద్ధాల వల్లే ఈ పరిస్థితి"*  

కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "యుద్ధాల వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? యుద్ధం ముగించి శాంతి కోసం ప్రపంచ దేశాలు పాటు పడాలి" అని పిలుపునిచ్చారు.



Post a Comment

Previous Post Next Post