•రామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండా లో ఘటన
•తలకు తీవ్ర గాయాలు
•కామారెడ్డి ఆసుపత్రి లో చికిత్స
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్దిపేట గ్రామ శివారులోని స్కూల్ తండాకు చెందిన మట్టు (35) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే దాడి చేసింది పులులా, ఎలుగుబంటి యా అనే ప్రచారం జరుగగా, అది ఎలుగుబంటి యే అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు
కట్టెలు అమ్ముకొనే మట్టు (35) కట్టెలు ఏరుకొనేందుకు శుక్రవారం ఉదయం తన భార్య తో కలిసి అడవిలోకి వెళ్లగా, అక్కడ ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మట్టును కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్నకు తరలించారు. తలకు కుట్లు వేశారు. దాడి చేసింది పులులా? ఎలుగుబంటి యా అనే ప్రచారం జరుగగా, అది ఎలుగుబంటి అని తండా వాసితో పాటు అటవీ శాఖ అధికారులు చెప్పారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Post a Comment