Dist Collector | అర్హులైన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి

 

•అక్రిడిటేషన్ కమిటీతో  కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష

•విధి విధానాలపై చర్చించిన సభ్యులు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : జీవో 252 నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సక్రమంగా చేరవేయడంలో మీడియా ప్రతినిధుల పాత్ర కీలకమని అన్నారు. కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు.

సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. జిల్లా లో అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ లో 463 మంది దరఖాస్తు చేసుకున్నట్లు డి పి ఆర్ ఓ కలెక్టర్ కు తెలిపారు. మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దరఖాస్తులను అన్నీటిని పరిశీలించాలని కమిటీకి సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీపీఆర్ఓ తిరుమల, కమిటీ సభ్యులు వి. రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, వుక్కల్కర్ రాజేందర్‌నాథ్, వేణుగోపాల చారి, సయ్యద్ కౌసర్ అలీ, వి. శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్ర శేఖర్, మహమ్మద్ ఆబిద్ పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post