MLA PSR | కుస్తీ పోటీలకు ఎమ్మెల్యే పోచారం హాజరు

 

బాన్సువాడలో బేతాళ స్వామి జాతర ఉత్సవాలు 

•కుస్తీ పోటీలకు ఎమ్మెల్యే పోచారం హాజరు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలో బేతాళ స్వామి వారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా శుక్రవారం బేతాళ స్వామి ఆలయ కమిటీ, బాన్సువాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్  కాసుల బాలరాజు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.





*బహుమతి ప్రదానం:*  

కుస్తీ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ.15,000 నగదు, రెండవ బహుమతిగా 2 తులాల కడియంను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, కుస్తీ పోటీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Post a Comment

Previous Post Next Post