Ex MLA Gampa Govardhan | కాలేశ్వరంపై హైకోర్టు తీర్పు సీఎంకు చెంపపెట్టు

 


•రైతులకు క్షమాపణ చెప్పాలి 

•మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, ఏప్రిల్ 23: కాలేశ్వరం ప్రాజెక్టుపై గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని, ఆయన వెంటనే రైతాంగానికి బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు.


(ప్రెస్ మీట్ వీడియో 👆)

గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 94 వేల కోట్ల రూపాయలు ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ సీఎం తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.

"జస్టిస్ ఘోస్ట్ కమిషన్ కాదు అది. పీసీసీ ఏర్పాటు చేసిన కమిషన్" అని ఎద్దేవ చేశారు. రెండేళ్ల క్రితమే ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడితే రైతాంగం ఎంతో సంతోషపడేవారని అన్నారు.

కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని హైకోర్టు తీర్పు స్పష్టం చేసిందని గంప గోవర్ధన్ పేర్కొన్నారు.


Post a Comment

Previous Post Next Post