•నిజామాబాద్‌లో కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి భూమి పూజ
•టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి సీతక్క చేతుల మీదుగా శంకుస్థాపన
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ ఘనంగా జరిగింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా అధునాతన వసతులతో జిల్లా కార్యాలయం నిర్మిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని అన్నారు.
జిల్లాలో పార్టీ బలోపేతానికి నూతన కార్యాలయం దోహదపడుతుందని నేతలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
అదేవిధంగా నిజామాబాద్ మాజీ మేయర్ నీతూ కిరణ్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్, మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, వ్యవసాయ-రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జి సునీల్, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
====================================
News in English 👇
Bhoomi Pooja for Congress District Office Held in Nizamabad
TPCC President Mahesh Goud, Minister Seethakka Lay Foundation Stone
Telangana daily news, Nizamabad, April 29:* The Bhoomi Pooja for the construction of the new Congress party district office building was held grandly on Wednesday near the Railway Station in Nizamabad district headquarters.
Telangana Pradesh Congress Committee President and MLC Mahesh Kumar Goud, along with Panchayat Raj & Rural Development Minister Dr. Danasari Anasuya Seethakka, performed the Bhoomi Pooja and laid the foundation stone.
Government Advisor and Bodhan MLA P. Sudarshan Reddy, Government Advisor Mohammed Shabbir Ali, Nizamabad DCC President Nagesh Reddy, Nizamabad Rural MLA Bhupathi Reddy, State Agros Chairman Kasula Balaraju, and former DCCB Chairman Pocharam Bhaskar Reddy participated in the event.
Also present were Nizamabad Mayor Neetu Kiran, Seed Corporation Chairman Anvesh Reddy, Urdu Academy Chairman Taher Bin Hamdan, State Mineral Development Corporation President and former MLA Eravathri Anil Kumar, Telangana Cooperative Union Chairman and former DCC President Manala Mohan Reddy, NUDA Chairman Kesha Venu, Agriculture and Farmers Welfare Commission Member Gadugu Gangadhar, former MLCs Akula Lalitha and Arikela Narsa Reddy, Armoor constituency in-charge Vinay Reddy, Balkonda constituency in-charge Sunil, public representatives from Banswada constituency, and district Congress leaders and party workers in large numbers.
Speaking on the occasion, TPCC President Mahesh Kumar Goud said the district office will be built with modern facilities to remain accessible to party workers. Minister Seethakka stated that the office will serve as a platform for resolving public grievances.
The leaders expressed hope that the new office will contribute to strengthening the party in the district



Post a Comment