Water Service | గజ్యా నాయక్ తండాలో చలివేంద్రం ప్రారంభం


•గజ్యా నాయక్ తండాలో చలివేంద్రం ప్రారంభం

•గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బాటసారులకు దాహార్తి తీర్చే ఏర్పాటు

తెలంగాణ డైలీ న్యూస్,  మాచారెడ్డి: ఎండల తీవ్రత దృష్ట్యా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు గజ్యా నాయక్ తండా గ్రామపంచాయతీ పాలకవర్గం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

బుధవారం గ్రామంలోని బస్టాండ్ వద్ద సర్పంచ్ రావుల వినోద్ ప్రభాకర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ప్రజలు, బాటసారులు ఇబ్బంది పడకుండా మంచినీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామపంచాయతీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డు సభ్యులు లావణ్య, రామ్, ఎజాజ్, స్వామి, బాబా ఖాన్, రమేష్, జీపీ సిబ్బంది, కారోబార్ సతీష్, మోహన్, రాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిరోజూ చలివేంద్రంలో చల్లని మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు. గ్రామపంచాయతీ చొరవను స్థానికులు అభినందించారు.

Post a Comment

Previous Post Next Post