Hajj Training | రేపు హజ్ యాత్రికులకు ప్రత్యేక శిక్షణా శిబిరం

 


👉రేపు కామారెడ్డిలో ప్రత్యేక శిబిరం

👉హాజరువుతున్న మౌలానా ఖారీ రషీద్ అహ్మద్

👉హజ్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి జావీద్ అలీ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: ముస్లింల పవిత్ర పుణ్య క్షేత్రమైన సౌదీ అరేబియా లోని మక్కాలో జరిగే హజ్ యాత్ర కు సంబంధించిన శిక్షణా శిబిరాన్ని ఆదివారం కామారెడ్డి లో నిర్వహిస్తున్నామని జిల్లా హజ్ సొసైటీ ఉపాధ్యక్షలు మహ్మద్ జావీద్ అలీ తెలిపారు. ఇందులో ముఖ్య అతిథిగా మౌలానా ఖారీ రషీద్ అహ్మద్ సాహెబ్ (గుజరాత్) - ప్రముఖ ధార్మిక పండితులు ప్రత్యేక ప్రసంగం చేస్తారని తెలిపారు. అసర్ నమాజు తర్వాత నుంచి ఇషా నమాజు వరకు మదీనా మంజిల్, విద్యానగర్, మక్సూద్ అడ్వకేట్  నివాసంలో జరుగుతుందని తెలిపారు."మన హజ్ ఆమోదయోగ్యంగా, బరకత్‌తో కూడుకున్నదిగా చేసుకుందామనే ఉద్దేశ్యం తో ఈ శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమ వివరాలు:

1. అసర్ నమాజు తర్వాత కార్యక్రమం ప్రారంభం

2. హజ్, ఉమ్రా ఆచారాలపై పండితుల వివరణాత్మక మార్గదర్శనం

3. మగ్రిబ్ నమాజు తర్వాత ప్రశ్నోత్తరాల ప్రత్యేక సెషన్

విజ్ఞప్తి: హజ్, ఉమ్రా చేయబోయే యాత్రికులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ శిక్షణా శిబిరానికి హాజరై, సున్నత్ ప్రకారం సరైన పద్ధతులు నేర్చుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు  9959444430, 9951112837 నెంబర్ల పై సంప్రదించాలని కోరారు.

--------------------------------------------------------


Special Hajj training

 Camp for pilgrims in Kamareddy

Telangana Daily News, Kamareddy : According to information provided by Mohammad Javed Ali, district Vice President of the  Hajj Society, a grand Hajj and Umrah training gathering was organized in Kamareddy with the aim of properly preparing pilgrims for Hajj and Umrah rituals.

This important training program will be held on April 19, 2026 (Sunday) after Asr prayer until Isha prayer under the theme: “Let us make our Hajj accepted and blessed.” The venue is Madina Manzil,  Vidyanagar resident of maqsood advocate Kamareddy

Prominent religious scholars and respected personalities from across the country will attend. Renowned scholar Maulana Qari Rasheed Ahmed Sahib (Gujarat) will be the chief guest and deliver a special lecture.

The program will begin after Asr prayer. Scholars will provide detailed guidance on Hajj and Umrah rituals. A special session will be held after Maghrib prayer where attendees can ask questions and receive clarifications.

Hajji Maqsood Ahmed has requested all intending pilgrims to attend this important training session with their families and learn the correct methods of performing Hajj and Umrah according to Sunnah.

For more details, contact: 9959444430, 9951112837

Post a Comment

Previous Post Next Post