![]() |
| విచారణ జరుపుతున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు |
#ఎల్లారెడ్డిలో విషాదం
#విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు
తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కలకలం రేపింది.
ఘటన వివరాలు:
ఎప్పుడు: బుధవారం ఉదయం 5:45 గంటలకు
ఏం జరిగింది: హాస్టల్‌లో కింద పడిపోయి ఉన్న శ్రావణిని తోటి విద్యార్థినులు గమనించి హాస్టల్ సిబ్బందికి తెలిపారు. నశ్రులాబాద్ మండలం హజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి గత నాలుగేళ్లు గా హాస్టల్ లో ఉండి చదువుకుంటోంది.
ఆసుపత్రికి తరలింపు: హుటాహుటిన అంబులెన్స్ ద్వారా ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల నిర్ధారణ: ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Post a Comment