ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు మంచి అవకాశం
(తెలంగాణ డైలీ న్యూస్-బాన్సువాడ)
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారి సహకారంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా శ్రీ అక్షయ్ HR సర్వీసెస్ హైదరాబాద్, MSN కంపెనీ ద్వారా టెన్త్,ఇంటర్,డిగ్రీ,ఎంబీఏ, బీఎస్సీ అగ్రికల్చర్,హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.వయస్సు 18 నుండి 30 సంవత్సరాలు కలిగిన యువతి, యువకులకు బ్యాంకింగ్,హోటల్ మేనేజ్మెంట్,ఐటిఐ ఎలక్ట్రిషన్,ఫ్రంట్ ఆఫీస్,సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫార్మా తదితర విభాగాల్లో భాగంగా అన్ని రకాల సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారనీ తెలియజేశారు. బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు నిర్వహించే ఈ జాబ్ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హైలైట్స్ :
*తేదీ:* 15వ తేదీ (బుధవారం)
*సమయం:* ఉదయం 9:00 నుండి 1:00 వరకు
*స్థలం:* ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాన్సువాడ
*ప్రత్యేక ఆకర్షణ:*
1. *జిల్లా కలెక్టర్ గారు* ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు
2. *తెలంగాణ ఇన్నోవేషన్ టెక్నాలజీ అసోసియేషన్* సహకారంతో నిర్వహణ
*పాల్గొనే ప్రముఖ కంపెనీలు:*
- Akshay HR Services
- MSN Pharma
- Dr. Reddy's Foundation (Tech Jobs)
- Hetero Pharma
- Human Laboratories
*అర్హతలు:* 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, MBA, http://B.Tech, http://B.Sc, http://B.Sc Agriculture, Hotel Management, MLT
*ఉద్యోగ అవకాశాలు:* IT (AI/ML), Banking, Hotel Management, ITI Electrician, Front Office, Sales Executive, Pharma
*వయస్సు పరిమితి:* 18 నుండి 30 సంవత్సరాలు
*గమనిక:*
- అన్ని రకాల సౌకర్యాలతో ఉద్యోగ అవకాశాలు
- నిరుద్యోగ యువతకు మంచి అవకాశం
*రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి:*
94933 10781, 98484 30111, 90415 71656
*వినతి:* జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి.
*నిర్వాహకులు:* జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, షేక్ సలాం

Post a Comment