తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
వేసవి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వడం ఎంతో పుణ్యకార్యమని, నీరు అల్లాహ్ మానవులకు ఇచ్చిన గొప్ప వరమని పేర్కొంటూ బాన్సువాడ PSR చౌరస్తాలో మొహమ్మద్ మెకానిక్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. (వీడియో 👇)
శుక్రవారం రోజు అసర్ నమాజ్ తర్వాత పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ ప్రజల కోసం చలివెంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. ఉలమాల సూచన మేరకు దుకాణాలు, వ్యాపార సంస్థల ముందు నీరు అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో షాదీ ఖానా చైర్మన్ హాఫిజ్ అబ్దుల్ వహాబ్, స్థానిక కౌన్సిలర్ నగేష్, అలాగే కలీమ్, అజీమ్, అశోక్, ఖాజా, జమీల్ మెకానిక్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment