Top News

Kamareddy | కొల్లూరులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత

# కామారెడ్డి జిల్లాలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లా లో ఎండ వేడిమి హేచ్చుమీరింది. గురువారం నాడు ఉష్ణోగ్రత ఏకంగా 44 దాటింది. దీంతో మధ్యాహ్నం జిల్లాలోని, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సవాడ తదితర ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. 

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) విడుదల చేసిన ఉష్ణోగ్రతల నివేదిక ఇది....
* Automatic Weather Stations డేటా *16/04/2026 ఉదయం 8:30 నుంచి 17/04/2026 ఉదయం 8:30* వరకు సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలు:

*ముఖ్యాంశాలు:*
1. *వేడి హెచ్చరిక - Alert స్థాయి*: లిస్ట్‌లో ఉన్న అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత *40°C నుంచి 45°C* మధ్య ఉంది. దీన్ని ఆరెంజ్ కలర్ "Alert" గా చూపించారు.

2. *అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు:*
   - *కొల్లూర్, బాన్సువాడ* - 44.2°C 
   - *బిర్కూర్* - 44.1°C
   - *మెనూర్, మద్నూర్* - 43.8°C
   - *భిచ్కుంద* - 43.7°C
   - *డోంగ్లీ, ఏలుపుగొండ, పిట్లం* - 43.6°
     - పాత రాజంపేట్: 42.6°C
   - IDOC కామారెడ్డి: 41.8°C
   - లింగంపేట్: 42.1°C
3. *చివరి స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు:*
- గాంధారి, రాజంపేట, రామారెడ్డి మండలాలు - 40.8
4. *వర్షపాతం*: అన్ని స్టేషన్లలోనూ 0.0 mm. అంటే పూర్తిగా పొడి వాతావరణం
   - 
 45°C దాటితే "Warning" రెడ్ అలర్ట్ ఇస్తారని,  ప్రస్తుతం అన్ని ప్రాంతాలు "Alert" స్థాయిలో ఉన్నాయని,. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post