మీసేవా కేంద్రాల్లో ACB ఆకస్మిక తనిఖీలు
గుర్తించిన అవకతవకలు
ఎక్కువ డబ్బులు వసూలు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ వారు బుధవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా 13 మీసేవా కేంద్రాల్లో తనిఖీలు చేయగా, వారి అవినీతి, అక్రమాలు బహిర్గతం అయ్యాయి. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మంచిర్యాల సహా పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా, అనేక విషయాలు తెలిసాయి. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు యదేచ్చగా అవినీతి కి పాల్పడుతున్నారని గుర్తించిన ఏసిబి అధికారులు తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
*గుర్తించిన ప్రధాన అవకతవకలు:*
👉*నకిలీ పత్రాలు*: ఆల్వాల్ ప్రభుత్వ మీసేవా కేంద్రం పక్కన జిరాక్స్ షాప్‌లో ఖాళీ కుల ధృవీకరణ, నివాస, ఆదాయ, OBC, EWS సర్టిఫికెట్లు, నోటరీ స్టాంపులు ఉన్న ఖాళీ పేపర్లు దొరికాయి. వీటితో తయారు చేసిన నకిలీ పత్రాలు కూడా లభించాయి. దీనిపై http://Cr.No.350/2026 కేసు నమోదైంది.
👉*ఎక్కువ డబ్బు వసూలు*: చాలా కేంద్రాల్లో దరఖాస్తుదారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు.
👉*అనధికారిక వ్యక్తులు*: ఖమ్మం మీసేవాలో అధీకృత వ్యక్తికి బదులు అనధికారిక వ్యక్తులు సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తున్నారు.
👉*నోటరీ అక్రమాలు*: సరూర్‌నగర్, తార్నాక కేంద్రాల్లో ఖాళీ నోటరీ పేపర్లు, నోటరీ పేరుతో అదనపు వసూళ్లు గుర్తించారు.
👉*మధ్యవర్తుల ప్రమేయం*: మీసేవా సిబ్బందికి, అనధికారిక ఏజెంట్లకు మధ్య UPI లావాదేవీలు, WhatsApp చాట్లు బయటపడ్డాయి.
👉*తదుపరి చర్యలు:* ACB నివేదిక ప్రభుత్వానికి పంపి సంబంధిత మీసేవా కేంద్రాలపై చర్యలు తీసుకోనుంది.
👉*ప్రజలకు విజ్ఞప్తి:* లంచం అడిగితే *ACB టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయండి. WhatsApp: 9440446106, Facebook: Telangana ACB, X: @TelanganaACB. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు.


Post a Comment