[ఫోటో: కామారెడ్డిలో మహర్షి భగీరథ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నూర్ భాషా దూదేకుల సంఘం నాయకులు]
•కామారెడ్డిలో మహర్షి భగీరథకు నూర్ భాషా దూదేకుల సంఘం ఘన నివాళి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం నూర్ భాషా దూదేకుల సంఘం ఆధ్వర్యంలో మహర్షి భగీరథకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నూర్ భాషా దూదేకుల సంఘం అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు లాలూ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మహర్షి భగీరథను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆయన పట్టుదల, త్యాగం నేటి తరానికి మార్గదర్శకమని, ప్రత్యేకంగా యువత ప్రజా సేవ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఫతే మొహమ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి షాదుల్, జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ అజీజ్ తదితరులు పాల్గొని భగీరథ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
.jpg)

Post a Comment