![]() |
| చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే కేవీఆర్ |
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
మాచారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి స్వయంగా చెక్కులను అందజేశారు.
అలాగే పల్వంచ, బీబీపేట్, దోమకొండ మండల కేంద్రాల్లోని రైతు వేదిక లో మండల పరిధిలోని గ్రామాల కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ది దారులకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చెక్కులను పంపిణి చేశారు.
కల్యాణ లక్ష్మి పథకం కింద SC, ST, BC, EBC వర్గాల పేద ఆడపిల్లల పెళ్లికి, షాది ముబారక్ పథకం కింద ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.





Post a Comment