Top News

Civil Supplies Commisioner | ధ్యానం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కమిషనర్


ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష

కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలనీ ఆదేశాలు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ ప్రధాన కార్యదర్శి & కమిషనర్  స్టీఫెన్ రవీంద్ర మంగళవారం నాడు కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ (PACS), గోకుల్ తాండా పీపీసీ (IKP)లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, ప్యాడీ కొనుగోలు కేంద్రాల పనితీరును పరిశీలించారు. ప్యాడీ కొనుగోలులో భాగంగా పని చేస్తున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే రైతులకు చెల్లింపులు త్వరగా జరగేందుకు OPMS టాబ్లెట్లలో నమోదులను సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


ప్రస్తుతం జిల్లాలో మొత్తం 35,300 మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DCSO), డీఎం (సివిల్ సప్లైస్), DRDO, DCO, DLMO, AD (మార్కెటింగ్) మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post