Top News

Ramareddy Mandal Topper | ఉప్పల్‌వాయి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని రామారెడ్డి మండల టాపర్

ఉప్పల్‌వాయి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని రామారెడ్డి మండల టాపర్

581 మార్కులతో ఆకుల నయన శ్రీ ప్రతిభ

తెలంగాణ డైలీ న్యూస్, రామారెడ్డి, ఏప్రిల్ 29: ఉప్పల్‌వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థిని ఆకుల నయన శ్రీ పదో తరగతి పరీక్షల్లో 581 మార్కులు సాధించి రామారెడ్డి మండల టాపర్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా ఆకుల నయన శ్రీ మాట్లాడుతూ ఉప్పల్‌వాయి హైస్కూల్లో చదువుతూ నాకు 581 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ మార్కులు రావడానికి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం, బోధన ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.

నయన శ్రీ సాధించిన విజయం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమెను ఆశీర్వదించారు.

Post a Comment

Previous Post Next Post