Top News

Road Accident | మెదక్ జిల్లా కొల్చారం వద్ద బోధన్ బస్సుకు ఘోర ప్రమాదం

 


•మెదక్ జిల్లా కొల్చారం వద్ద ఘోర బస్సు ప్రమాదం  

•30 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

గాయపడిన వారిలో కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రయాణికులు

తెలంగాణ డైలీ న్యూస్, మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా బోధన్ కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు, ధాన్యంతో వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. (వీడియో 👇)


ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో కామారెడ్డి, మెదక్ జిల్లాల ప్రయాణికులు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే కొల్చారం పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా మెరుగైన చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 

లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.












Post a Comment

Previous Post Next Post