వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రధాన రోడ్డు పై మిట్ట మధ్యాహ్నం విషాదం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై మంగళవారం మిట్ట మధ్యాహ్నం వడదెబ్బతో ఓ గుర్తు తెలియని వ్యక్తి కిందపడి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
ఘటన వివరాలు
తీవ్ర ఎండలో రోడ్డుపై కిందపడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
44 డిగ్రీలతో భగభగలు
మంగళవారం బాన్సువాడలో సుమారు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భరించలేని ఎండలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
అప్రమత్తంగా ఉండాలి
వడగాలుల తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావొద్దని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. తల తిరగడం, వాంతులు, విపరీతమైన చెమట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.



Post a Comment