పిట్లంలో "ఖత్మే నబువత్ వర్క్‌షాప్"
మే 9, 10 తేదీల్లో మస్జిద్-ఎ-వహీద్‌లో ఒక రోజు వర్క్‌షాప్
ప్రముఖ ఉలమాల ప్రసంగాలు, భోజన వసతి ఏర్పాట్లు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: జిల్లాలోని పిట్లం పట్టణంలో గల మస్జిద్-ఎ-వహీద్ ఆవరణలో ఈనెల 9, 10 తేదీల్లో "ఒక రోజు తఫ్హీమ్ ఖత్మే నబువత్ వర్క్‌షాప్" నిర్వహించనున్నారు. తహఫ్ఫుజ్ ఖత్మే నబువత్ ట్రస్ట్, నిజామాబాద్ పర్యవేక్షణలో మజ్లిస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబువత్ ట్రస్ట్, తెలంగాణ & ఆంధ్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని జామ మస్జీద్ ఇమామ్ మౌలానా మహమూద్ అలీ, అయేషా మస్జీద్ ఇమామ్ మౌలానా ఈసా తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి:
మే 9 శుక్రవారం మగ్రిబ్ నమాజ్ తర్వాత ప్రారంభమై, మే 10 శనివారం ఇషా నమాజ్ వరకు వర్క్‌షాప్ కొనసాగుతుంది.
ఈ వర్క్‌షాప్‌లో హైదరాబాద్, నిజామాబాద్ నుండి పలువురు ప్రముఖ ఉలమాలు పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రసంగాల వివరాలు:
👉"ఏ కారణాల వల్ల మనిషి ఇస్లాం నుండి బయటకు వెళ్తాడు?" - మౌలానా ముఫ్తీ అబూబకర్ జాబిర్ ఖాస్మీ
👉"ఖత్మే నబువత్ అకీదా మరియు దానిని నిరాకరించేవారు" - మౌలానా ముఫ్తీ సయీద్ అక్బర్ నక్ష్‌బందీ
👉"ఖాదియానీలు ముస్లింలు ఎందుకు కాదు?" - మౌలానా ముఫ్తీ మహబూబ్ ముహమ్మద్ ఖాస్మీ
👉"హదీస్ నిరాకరణ మరియు ఫిత్నా-ఎ-గామిదియత్" - మౌలానా ముహమ్మద్ అన్సారుల్లా ఖాస్మీ
👉"ఫిత్నా-ఎ-గోహర్ షాహీ" - ముఫ్తీ అబ్దుల్ ఖవీ ఉమర్ హుసామీ
👉"ఇంజనీర్ ముహమ్మద్ అలీ మిర్జా తప్పుడు భావాలు" - ముఫ్తీ అబ్దుల్ మున్ఇమ్ ఫారూఖీ
👉"ఫిత్నా-ఎ-తక్ఫీల్ బిన్ హనీఫ్" - మౌలానా ముహమ్మద్ వజీహుద్దీన్ ఖాస్మీ
👉"ఫిత్నా-ఎ-ఫయ్యాజ్" - ముఫ్తీ అబ్దుల్ ఖవీ ఉమర్ హుసామీ
సదరాతీ ఖితాబ్: హజరత్ మౌలానా ముహమ్మద్ అర్షద్ అలీ ఖాస్మీ
ఖిరాఅత్: ఖారీ మఖ్దూమ్ యాసిర్
నాజిమ్-ఎ-జల్సా: మౌలానా మహమూద్ అషాతీ
కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు శుక్రవారం మధ్యాహ్నం నుంచే వేదిక వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు కోరారు. హాజరయ్యే వారందరికీ భోజనం, వసతి ఏర్పాట్లు చేశామని, తక్కువ సామానుతో రావాలని సూచించారు.
నిర్వాహకులు: తంజీమ్ అల్-మసాజిద్ వ జమ్ఈయత్ ఉలమా వ హుఫ్ఫాజ్ వ నౌజవానాన్-ఎ-పిట్లం
సంప్రదింపులు: 9666307780, ఖలీల్ నద్వీ - 9912666997


Post a Comment