Indiramma Houses | ఇందిరమ్మ ఇంటికి నూతన గృహప్రవేశం

ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్. చిత్రంలో లబ్ధిదారులు గోనె శ్రీలత, శ్రీనివాస్, ఉపసర్పంచ్ లకావత్ బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి స్వామి తదితరులు.

•ఇందిరమ్మ ఇంటికి నూతన గృహప్రవేశం  

•సర్పంచ్ వినోద ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం

తెలంగాణ డైలీ న్యూస్, మాచారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటికి గోనె శ్రీలత, శ్రీనివాస్ దంపతులు శుక్రవారం  నూతన గృహప్రవేశం చేశారు. మాచారెడ్డి గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లకావత్ బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 

లబ్ధిదారులైన శ్రీలత, శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

సర్పంచ్ వినోద ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


Post a Comment

Previous Post Next Post