Complaint to RTI Commissioner | సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం: కమిషనర్‌కు ఫిర్యాదు

సమాచార హక్కు చట్టం అమలులో అధికారుల నిర్లక్ష్యం: కమిషనర్‌కు ఫిర్యాదు  

ఆర్టీఐ బోర్డులు, అధికారుల వివరాలు కార్యాలయాల్లో లేవు  

30 రోజుల్లో సమాచారం ఇవ్వడం లేదు, తప్పుడు సమాధానాలు  

దరఖాస్తుదారుల వివరాలు గోప్యంగా ఉంచడం లేదు: లెగ్గేల రాజు  

తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: 

సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజు బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావును వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 

అనంతరం ఆయన సమాచార హక్కు చట్టం అమలులోని లోపాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం - 2005 బోర్డులు పెట్టడం లేదని, బోర్డులు ఉన్న చోట కూడా అధికారుల వివరాలు లేవని తెలిపారు. 

ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే 30 రోజుల్లో ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుదారునికి సరైన సమయానికి సరైన సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇస్తూ చట్టాన్ని కాలరాస్తున్నారని చెప్పారు. రికార్డులు లేవు, రిజిస్టర్లు లేవు అని సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. 

ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుని వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉండగా, అధికారులు వారి వివరాలు అందరికీ తెలిసేలా చేస్తున్నారని తెలిపారు. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు రాష్ట్ర కమిషన్ వరకు రాలేకపోతున్నారని వివరించారు. 

ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రతి మండల స్థాయిలో అధికారికంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కమిషన్ దృష్టి పెట్టాలని లెగ్గేల రాజు కోరారు.

Post a Comment

أحدث أقدم