Top News

Flood Demo's | కామారెడ్డి జిల్లాలో వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్


•కామారెడ్డి జిల్లాలో వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్

•విపత్తు నిర్వహణకు సిద్ధం

•డెమోలను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లాలో వరదలపై మాక్ ఎక్సర్‌సైజ్‌ను సోమవారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కౌండిల్య కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరై వివిధ డెమోలను పరిశీలించారు.

వరదల సమయంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ప్రభుత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ముందస్తు ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలు, సహాయక చర్యలను సమీక్షించి మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. (Video 👇)



జిల్లాలోని 7 మండలాల్లో ఈ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి మండలం కౌండిల్య కాలనీతో పాటు బిక్నూర్‌లోని రామేశ్వరపల్లి, రాజంపేటలోని గుండారం, బీబీపేట్‌లోని పెద్ద చెరువు, మద్నూర్‌లోని బొగ్గుగుడిసె, ఎల్లారెడ్డిలోని తిమ్మారెడ్డి, నాగిరెడ్డిపేట్‌లోని మేజర్‌వాడ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.

వరదల్లో కొట్టుకుపోయిన బాధితులకు CPR ద్వారా ప్రాథమిక చికిత్స అందించే విధానం, రెస్క్యూ పరికరాల వినియోగం, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పద్ధతులను అధికారులు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. అనంతరం మాక్ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బందికి వర్షాకాలం దృష్ట్యా రెయిన్‌కోట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని విపత్తు నిర్వహణ అధికారులు జూమ్ ద్వారా మానిటర్ చేశారు. ACLB ఇన్‌చార్జ్ ఎన్‌వీ గిరి, DFO సుధాకర్, DCMHO విజయభాస్కర్, PD మెప్మా శ్రీధర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

Previous Post Next Post