Top News

Police Nakabandi | జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో నాకాబంది


•జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో నాకాబంది

•156 స్పాట్ చలాన్లు, ₹ 37,200 జరిమానా

•పెండింగ్ చలాన్ల వసూలు

తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, నిర్మల్:  

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఏకకాలంలో నాకాబంది నిర్వహించి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రధాన చౌరస్తాలు, రహదారులు, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో నంబరు ప్లేట్లు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి స్పాట్ చలానాలు జారీ చేశారు. 

జిల్లా వ్యాప్తంగా మొత్తం 156 స్పాట్ చలానా కేసులు నమోదు చేసి రూ.37,200 జరిమానా వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 228 వాహనాలకు రూ.57,090 జరిమానా విధించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 173 వాహనాల చలానాల ద్వారా రూ.57,855 వసూలు చేశారు. అంతేకాకుండా 41 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 

ఈ నాకాబందిలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ భైంసా పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పాల్గొని తనిఖీలను పర్యవేక్షించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచడానికే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post