Haj Piligrims Felicitated | ఎల్లారెడ్డిలో హజ్ యాత్రికులకు ఘన సన్మానం


ఎల్లారెడ్డిలో హజ్ యాత్రికులకు ఘన సన్మానం  

ముస్లిం వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో సత్కారం  

తెలంగాణ డైలీ న్యూస్,ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఐదుగురు హజ్ యాత్రికులకు Yellareddy Muslim Welfare Committee ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది.

పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరుతున్న మాజీ జెడ్పీటీసీ షేక్ గయాజుద్దీన్, సిరాజుద్దీన్, ముజాజుద్దీన్, హనీఫ్, ఆరిఫ్‌లను కమిటీ సభ్యులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. యాత్రికులు పవిత్ర హజ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మాజీ జెడ్పీటీసీ షేక్ గయాజుద్దీన్ మాట్లాడుతూ "హజ్ యాత్ర ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర. జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయడం ప్రతి ముస్లింకు గొప్ప అదృష్టంగా, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తాం. అల్లాహ్ పట్ల భక్తి, సహనం, త్యాగం, సమానత్వం వంటి విలువలను హజ్ యాత్ర ప్రపంచానికి చాటిచెబుతుంది" అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముకరం అలీ, సయ్యద్ మీర్, అహ్మద్ పాషా, హబీబ్ జాని, అహ్మద్, షాదుల్, జలాలుద్దీన్, షౌకత్ అలీ, మక్సుద్, అజహర్, మహబూబ్ సుమేర్‌తో పాటు ముస్లిం పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






*Yellareddy Muslim walfare Committee ఆధ్వర్యంలో ప్రతిభావంత విద్యార్థిని ఘన సన్మానం*


కామారెడ్డి జిల్లా Yellareddy మండలంలోని Machapur (Peddareddy) గ్రామానికి చెందిన బోనగిరి నందిని (తండ్రి: బోనగిరి అంజయ్య) పదో తరగతి పరీక్షల్లో 575 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.


ప్రభుత్వ / జెడ్పీ / మోడల్ / కేజీబీవీ పాఠశాలల విభాగంలో మండల ప్రథమ స్థానం, అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల కలిపిన విభాగంలో మండల ద్వితీయ స్థానం సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఆమె ZPHS Machapur (Peddareddy) పాఠశాలలో విద్యను అభ్యసించింది..


ఈ సందర్భంగా Yellareddy Muslim walfare Committee ఆధ్వర్యంలో విద్యార్థిని నందినిని ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో అభినందించి ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.


విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, నందిని సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని అభినందనలు తెలియజేశారు...

Post a Comment

Previous Post Next Post