•లియోనియా రిసార్ట్‌లో రాష్ట్ర ప్రముఖుల సమక్షంలో సంబరం
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: మారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుమారుడు అవనిష్ పుట్టు పంచల మహోత్సవం గురువారం రాత్రి షామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ శుభకార్యానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ప్రముఖులు హాజరై చిన్నారి అవనిష్‌ను ఆశీర్వదించారు.
హాజరైన ప్రముఖులు:
AICC Secretary in-charge సచిన్ సావంత్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని బాలుడికి దీవెనలు అందించారు.
సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ధోతి సెర్మనీ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక వర్గాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కుటుంబ సభ్యుల ఆనందం, అతిథుల సందడితో ఈ పుట్టు పంచల వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment