మెక్కా కాంగ్రెస్ అధ్యక్షుడు మాసూద్ వివాహ మహోత్సవం
ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, బిచ్కుంద:
బిచ్కుంద మండలం మెక్కా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మాసూద్ వివాహం గురువారం సాయంత్రం పట్టణంలోని శాంతి గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వివాహం జరగ్గా అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఎమ్మెల్యేతో పాటు పలువురు నేతలు
ఈ వేడుకకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు, మాజీ ఎమ్మెల్యేలు సౌధాగర్ గంగారాం, హన్మంత్ షిండే హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ పార్టీల నాయకుల శుభాకాంక్షలు
వివాహ మహోత్సవంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు పాల్గొని మాసూద్ దంపతులను ఆశీర్వదించారు. అలాగే పాత్రికేయులు ఎస్ మోహియొద్దీన్, గఫ్ఫార్, సయ్యద్ హన్ను, షేక్ గౌస్, అహ్మద్, అసద్ తదితరులు పాల్గొన్నారు.





Post a Comment