హంగర్గలో హనుమాన్ మందిరం పునఃనిర్మాణానికి భూమిపూజ
రానంపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
173 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండలం హంగర్గ గ్రామంలో హనుమాన్ మందిరం పునఃనిర్మాణం కోసం గురువారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమిపూజ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
అనంతరం రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారుడు కాసుల సాయిలుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
రూ.1.73 కోట్ల కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
అనంతరం బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో 71 మంది లబ్ధిదారులకు రూ.71,08,236, బాన్సువాడ గ్రామీణ మండలంలో 72 మందికి రూ.72,08,352, నసురుల్లాబాద్ మండలంలో 30 మందికి రూ.30,03,480 చొప్పున మొత్తం 173 మంది లబ్ధిదారులకు రూ.1,73,20,068 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, కాంగ్రెస్ నాయకులు గురు వినయ్, కాసుల రోహిత్, అలిమొద్దీన్ బాబా, యండి. దావూద్, ముజ్జు, అసద్ బిన్ మొహ్సిన్, నార్ల ఉదయ్, బాన్సువాడ పట్టణ, గ్రామీణ, నసురుల్లాబాద్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






Post a Comment