Officers On Duty | కామారెడ్డి జిల్లాలో పలువురు అధికారుల బాధ్యతల స్వీకరణ

కలెక్టర్ ను కలిసిన ఎల్లారెడ్డి కమిషనర్ జీవన్

•కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీ, సీఐలుగా నూతన అధికారులు

•కామారెడ్డి జిల్లాలో పలువురు అధికారుల బాధ్యతల స్వీకరణ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో పలువురు అధికారులు సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించారు. బదిలీలపై వచ్చిన అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిశారు.

మున్సిపల్ కమిషనర్ల బాధ్యతలు:  

1. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా టి. పర్వతాలు: శంషాబాద్ ఏఎంసీగా విధులు నిర్వహించి బదిలీపై వచ్చిన టి. పర్వతాలు సోమవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి పూల మొక్కను అందజేశారు.



2. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా జగ్జీవన్: నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి బదిలీపై వచ్చిన జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.

పోలీస్ శాఖలో నూతన నియామకాలు:  

1. కామారెడ్డి డీఎస్పీగా యస్. మధుసూదన్: కామారెడ్డి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా యస్. మధుసూదన్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల అనంతరం జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్రను కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.



2. భిక్నూర్ సీఐగా జె. నరేష్ కుమార్: భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా జె. నరేష్ కుమార్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులకు జిల్లా ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.



Post a Comment

Previous Post Next Post