రాజీవ్ గాంధీ వర్ధంతి: ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు నివాళులు
ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని పిలుపు
సమైక్యతే మన శక్తి, శాంతియుత భారతమే లక్ష్యం
నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఘనంగా నివాళులర్పించారు.
దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని రాజీవ్ గాంధీని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
సమైక్యతే మన శక్తి, శాంతియుత భారతమే మన లక్ష్యం అన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అలీ బిన్ అబ్దులా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అసద్, జిల్లా యువజన అధ్యక్షులు మధుసూదన్, గురు వినయ్, నార్ల సూరి, ఎజాస్, కౌన్సిలర్లు హకీమ్, రాజశేఖర్, రమేష్, కమ్రు, నియోజకవర్గ అధ్యక్షులు మన్సూర్, రవీందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మజ్జు, సుల్తానా, గౌస్, రేంజర్ల సాయిలు, రవీందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

إرسال تعليق