టీజీ ఈఏపీసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ముఖ్రమ్ అహ్మద్‌కు షబ్బీర్ అలీ సన్మానం
టీఎంఆర్ఈఐఎస్ విద్యార్థుల ప్రతిభను అభినందించిన ప్రభుత్వ సలహాదారు
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 150.17 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం
బైపీసీ, ఎంపీసీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:
టీజీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 150.17 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన ముఖ్రమ్ అహ్మద్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు.
టీఎంఆర్ఈఐఎస్ విద్యార్థి అయిన ముఖ్రమ్ అహ్మద్‌ను అభినందించిన షబ్బీర్ అలీ అతని భవిష్యత్ విద్యా, వృత్తి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఇతర విద్యార్థుల ప్రతిభను కూడా ఆయన అభినందించారు. బైపీసీ-2లో రాష్ట్ర సెకండ్ ర్యాంక్ సాధించిన అస్మా జుబిన్, బైపీసీ-2లో రాష్ట్ర థర్డ్ ర్యాంక్ సాధించిన షారిఖా ముస్కాన్, ఎంపీసీ-1లో రాష్ట్ర థర్డ్ ర్యాంక్ సాధించిన హురాయా దిల్‌సత్, బైపీసీ-1లో రాష్ట్ర థర్డ్ ర్యాంక్ సాధించిన ఆయేషా సిద్దిఖా, బైపీసీ-1లో రాష్ట్ర ఫోర్త్ ర్యాంక్ సాధించిన ఆఫియా తబస్సుంలకు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు తెలిపారు.

إرسال تعليق