•కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
•వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
•ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త వి. గంగాధర్ గౌడ్
•బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే : బాజిరెడ్డి గోవర్ధన్
•సార్.... మీరే రావాలి: బాజిరెడ్డికు ఓ నాయకుడి విన్నపం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే" అనిఉమ్మడి జిల్లా సమన్వయ కర్త వి. గంగాధర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఆదివారం పట్టణంలో జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త వి. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ "కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే" అని ధీమా వ్యక్తం చేశారు. "తెలంగాణను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. బీఆర్ఎస్ పోరాడే పార్టీ, పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. పదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేశాం. రైతుబంధు అమలులో, కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. మనం రైతు పంట కొనుగోలు చేశాం, వాళ్లు ఏ పంటా కొనడం లేదు. ప్రజల కష్టసుఖాలు వారికి తెలియదు" అని విమర్శించారు.
బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు
"బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలి. బాన్సువాడలో 259 పోలింగ్ బూతులు ఉన్నాయి. 518 మంది పోలింగ్ బూత్ యాక్టివ్ కార్యకర్తలు కావాలి. 50 మందితో సమన్వయ కమిటీ ఉంటుంది. ఇందులో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, బూత్ కమిటీ సభ్యులు ఉంటారు. ప్రతి బూత్‌లో ఇద్దరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారు కావాలి" అని గంగాధర్ గౌడ్ వివరించారు.
డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు
"కేంద్రం అన్ని పనులు డిజిటలైజేషన్‌లో చేస్తున్నందున మనం కూడా డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేస్తున్నాం. జనగణన డిజిటల్ విధానంలో జరిగినట్టు ఎస్ఐఆర్ నమోదు చేయాలి. ప్రతి బూత్‌కు ఒక వ్యక్తి బాధ్యత వహిస్తారు. ఉమ్మడి జిల్లాలో 2361 బూతులు ఉన్నాయి. 5000 మంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. క్రియాశీల సభ్యులకు 50 రూపాయలు, సాధారణ సభ్యులకు 10 రూపాయలు ఫీజు ఉంటుంది. ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి జిల్లాకు ఒక టెక్నీషియన్ ఉంటాడు. సమయం ఇచ్చిన వారినే ఈ బాధ్యతకు ఇవ్వండి" అని సూచించారు.
కార్యకర్తలకు భరోసా
"కార్యకర్తలు నిరాశ పడొద్దు. బాజిరెడ్డి గోవర్ధన్ అండగా ఉన్నారు. నియోజకవర్గానికి ఒక ఇంచార్జిని పెట్టబోతున్నాం. కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటాం. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో గెలుస్తాం. మంచి సంస్థాగత నిర్మాణం చేసుకోవాలి. గతంలో ముస్లింలకు రంజాన్ తోఫా, చీరలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదు" అని అన్నారు.
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ "సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏ విధంగా చేపట్టాలో సూచనలు ఇవ్వడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలో ఫోన్, మొబైల్ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగించి సభ్యత్వ నమోదు చేయడం కొత్త విధానం. కేసీఆర్ ఆదేశాల మేరకు డిజిటల్ నమోదు జరుగుతోంది. యాప్ ద్వారా నమోదు చేస్తారు. ప్రతి గ్రామం నుంచి ఆన్‌లైన్ ఫోన్ ఉన్నవారు ముందుకు రావాలి" అని పిలుపునిచ్చారు.
80 లక్షల సభ్యత్వమే లక్ష్యం
"బాన్సువాడలో ఎన్నికల్లో పడుతున్న కష్టం ప్రజలకు తెలియడం లేదు. ఎదుటి వ్యక్తి ఫ్లాప్ అయినా ఓట్లు వేస్తున్నారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. మెంబర్‌షిప్ డ్రైవ్ పునాది లాంటిది. భయం వద్దు, ధైర్యంగా ఉండండి. రేపు వచ్చేది మన పార్టీ ప్రభుత్వమే. కానీ ఇక్కడ ఓడిపోతే కుదరదు, మనం గెలవాలనే సంకల్పం ఉండాలి. ప్రజలు మనల్ని నమ్మాలి. రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి వచ్చామని చెప్పిన వారే ఇప్పుడు ఇదేం ప్రభుత్వం అంటున్నారు. మెంబర్‌షిప్ ముఖ్యం. 80 లక్షల మెంబర్లు కావాలి. మెంబర్‌షిప్ ఎక్కువ చేస్తే మనదే గెలుపు" అని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే
"బీజేపీ, కాంగ్రెస్ ఒకే పార్టీలు. బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వల్లే ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. వాళ్లిద్దరూ ఒక్కటే. కార్యకర్తలు, నాయకులు అలగవద్దు. నేనే అందరినీ తట్టి లేపాలా?. ట్రైన్ లెక్క ఫాస్ట్‌గా ఉండాలి. అందరూ గ్రామాల్లో తిరగాలి. వేరే వారిని కన్వీన్స్ చేయాలి. నాయకుడు వేరే ప్రాంతాల నుంచి ఎందుకు,ఇక్కడ నేనో... రవీందర్ రెడ్డియో కాదు, మీలో ఒకరు ముందుకు రండి" అని బాజిరెడ్డి పిలుపునిచ్చారు.
సార్.... మీరే రావాలి: బాజిరెడ్డికు ఓ నాయకుడి విన్నపం
బాన్స్వాడ నియోజకవర్గంలో మళ్ళీ మీరు రావాలి, ఇక్కడే ఉండాలి, మాకు మీరే ధైర్యం, ఇక్కడ ఉన్న జుబేర్ జుబేరే... అంజిరెడ్డి అంజిరెడ్డే అంటూ ఓ మండల నాయకుడు బాజిరెడ్డిని ప్రాధాయపడ్డాడు. ఏం జరిగినా, వారు పట్టించుకోరని ఆవేదన చెందారు. వీజీ గౌడ్ సమక్షంలో నే ఇక్కడి నాయకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
హాజరైన నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జుబేర్, నార్ల రత్నకుమార్, కిషన్, సాయిలు, రాంచందర్, కౌన్సిలర్లు ఖలీల్, ఫెరోజ్, ఇసాక్, ఆతిఫ్, సాయిలు, అందె రాజు, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





إرسال تعليق