AISB Demand |డిప్యూటీ డీఈఓ పోస్టులకు బీఈడీ, పీహెచ్‌డీ అర్హతలు తప్పనిసరి చేయాలి



డిప్యూటీ డీఈఓ పోస్టులకు బీఈడీ, పీహెచ్‌డీ అర్హతలు తప్పనిసరి చేయాలి

టీజీపీఎస్పీ నోటిఫికేషన్ పునఃసమీక్షించాలని డిమాండ్  

ఏఐఎస్‌బీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ డీఈఓ పోస్టులకు కేవలం డిగ్రీ, పీజీ అర్హతలను మాత్రమే నిర్దేశించడం సరికాదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (A.I.S.B) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు.

బీఈడీ, పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి

విద్యారంగానికి సంబంధించిన ఈ కీలక పోస్టులకు బీఈడీ, ఎంఈడీ, పీహెచ్‌డీ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుత విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ శిక్షణ, అనుభవం కలిగిన వారిని పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తేనే విద్యారంగంలో నాణ్యత పెరుగుతుందని రవీందర్ గౌడ్ తెలిపారు.

వేలాది మంది అభ్యర్థులకు అన్యాయం

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసిన వేలాది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ వారికి అవకాశం లేకపోవడం అన్యాయమని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను పునఃసమీక్షించి తగిన మార్పులు చేయాలని ఆయన కోరారు.

Post a Comment

أحدث أقدم