Top News

Cricket | కామారెడ్డిలో సమ్మర్ క్రికెట్ క్యాంప్ ముగింపు వేడుక

కామారెడ్డిలో సమ్మర్ క్రికెట్ క్యాంప్ ముగింపు వేడుక  

టీపీఎల్‌కు ఎంపికైన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలి: కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్  

క్రీడాకారులను అభినందించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:  

కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ క్యాంప్ ముగింపు వేడుక ఆదివారం ఘనంగా జరిగింది.  

ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు సోహియల్, కోచ్‌లు రామకృష్ణ, రియాజ్ పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ, శిక్షణ పొందిన క్రీడాకారులను అభినందించారు. కామారెడ్డి జిల్లా నుంచి టీపీఎల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని క్యాంప్‌లో శిక్షణ పొందిన క్రీడాకారులు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.  

క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, కఠోర సాధన అవసరమని, జిల్లా నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post