Top News

Dental Doctors | కామారెడ్డిలో ఐడీఏ జిల్లా సర్వసభ్య సమావేశం

కామారెడ్డిలో ఐడీఏ జిల్లా సర్వసభ్య సమావేశం 

_దంత వైద్య చికిత్సలకు ధరల పట్టిక నిర్ణయం_  

_ప్రతి క్లినిక్‌లో ధరల పట్టిక ప్రదర్శించాలని తీర్మానం_  

_నిర్ణయించిన ధరలకే చికిత్సలు చేయాలి: ఐడీఏ కామారెడ్డి శాఖ_  

_ప్రజలు సహకరించాలని అధ్యక్షుడు డా. అచుకట్ల జీవన్ వినతి_

తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి, జూన్ 22: ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సర్వసభ్య సమావేశం కామారెడ్డిలో జరిగింది.

ఈ సమావేశానికి ఐడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఎం. మల్లికార్జున్‌తో పాటు డా. సాజిద్, డా. సారా, డా. మాధవి, డా. స్వాతి మరియు జిల్లాకు చెందిన ప్రముఖ దంత వైద్యులు హాజరయ్యారు.

చికిత్సల ధరలపై కీలక నిర్ణయం 

సమావేశంలో దంత వైద్యులందరూ చర్చించి దంత వైద్యానికి సంబంధించిన చికిత్సలకు ధరలను నిర్ణయించారు. నిర్ణయించిన ధరల పట్టికను ప్రతి క్లినిక్‌లో ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని తీర్మానించారు.

నిర్ణయించిన ధరల ప్రకారమే అన్ని చికిత్సలు చేయవలసిందిగా ఐడీఏ కామారెడ్డి శాఖ తీర్మానం చేసింది. దీనికి ప్రజలు సహకరించాలని ఐడీఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డా. అచుకట్ల జీవన్, ప్రధాన కార్యదర్శి డా. అభిషేక్ రెడ్డి, కోశాధికారి డా. కవిత కోరారు.

Post a Comment

Previous Post Next Post