Dial 100 Call's Effect | క్షణాల్లో స్పందించి తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు

క్షణాల్లో స్పందించి తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు  

డయల్-100 కాల్‌తో అప్రమత్తం.. 5 నిమిషాల్లో రెస్క్యూ 

కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతిలను అభినందించిన ఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 13: డయల్-100కు వచ్చిన సమాచారంతో కామారెడ్డి టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి ఓ మహిళ, ఆమె కుమారుడి ప్రాణాలను కాపాడారు.

ఆత్మహత్యాయత్నం సమాచారం

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తన కుమారుడితో కలిసి కామారెడ్డి రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు డయల్-100కు సమాచారం అందింది.

5 నిమిషాల్లో రెస్క్యూ  

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై డయలర్ నుండి మహిళ ఫోటోను సేకరించి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతి చాకచక్యంగా వ్యవహరించి మహిళను, ఆమె కుమారుడిని గుర్తించి కేవలం 5 నిమిషాల్లో సురక్షితంగా రక్షించారు. అనంతరం వారికి భరోసా కల్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రజాసేవలో ముందుంటాం: ఎస్పీ 

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు కామారెడ్డి జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజాసేవలో ముందుంటారని జిల్లా ఎస్పీ తెలిపారు.సమయస్ఫూర్తితో స్పందించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతిలను జిల్లా ఎస్పీ అభినందించారు.

Post a Comment

أحدث أقدم