Farmers Protest | గ్రోమోర్ ఎరువుల సరఫరాలో జాప్యం : రైతుల ధర్నా



గ్రోమోర్ ఎరువుల సరఫరాలో జాప్యం : రైతుల ధర్నా  

మల్లాపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు  

 ప్రభుత్వం విఫలమైందని సర్పంచ్ ధర్మతేజ విమర్శ  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 12: బీర్కూర్ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం సిబ్బంది వైఖరిపై రైతులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పలు గ్రామాల రైతులు మల్లాపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.  

రైతుల ఆరోపణలు  

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి యూరియా సరఫరాలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, బీర్కూర్‌లోని గ్రోమోర్ సిబ్బంది మందులు, ఎరువుల సరఫరాలో మరింత జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని, దీంతో సాగు పనులకు ఆటంకం కలుగుతోందని వాపోయారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.  

సర్పంచ్ మద్దతు  

ధర్నాకు మద్దతు తెలిపిన బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మతేజ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎరువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రోమోర్ సిబ్బందిపై వ్యవసాయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎరువులు, మందుల సరఫరా సక్రమంగా జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.




Post a Comment

أحدث أقدم