Top News

Incident in Manjira | కామారెడ్డి జిల్లాలో విషాదం: మంజీరా నదిలో ముగ్గురు మహిళలు, ఒక యువకుడు గల్లంతు




కామారెడ్డి జిల్లాలో విషాదం: మంజీరా నదిలో ముగ్గురు మహిళలు, ఒక యువకుడు గల్లంతు

ముగ్గురి మృతి: ఒకరి కోసం గాలింపు, మరొకరి పరిస్థితి విషమం  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: జిల్లాలో శుక్రవారం మంజీరా నది విషాదాన్ని మిగిల్చింది. పిట్లం మండలం బోల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీర పరివాహక ప్రాంతంలో ఎల్లమ్మ తల్లి వేడుకలకోసం వచ్చిన నలుగురు మంజీరా నదిలో స్నానం చేసేందుకు దిగి ముగ్గురు మహిళలు, ఒక యువకుడు గల్లంతయ్యారు. వీరంతా పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందినవారు.  

ఘటన వివరాలు: 

వీరు బుడిమి శివారులోని ఎల్లమ్మ తల్లి వేడుకల కోసం వెళ్లారు. పక్కనే ఉన్న మంజీరా నదికి స్నానానికి వెళ్లిన నలుగురు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.  

ఈ ఘటనలో తల్లి అనిత (40), పావని శ్రీ (15), శివాని (13) మృతి చెందారు. అనిత, శివాని తల్లీకూతుళ్లుగా గుర్తించారు. మరో బాలుడైన సుశాంత్ ను బంధువులు ప్రాణాలతో కాపాడి బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.  (వీడియో 👇)





పోలీసుల దర్యాప్తు:

ఘటనా స్థలానికి చేరుకున్న పిట్లం పోలీసులు, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.  

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.  

ఈ ఘటనతో కిష్టాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.









ఎల్లమ్మ తల్లి వేడుకకు వెళ్లిన క్షణాలు.. తిరిగిరాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి

ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి: కిష్టాపూర్‌లో గుండెలు పగిలే రోదన  

గ్రామమంతా శోకసంద్రం  
కిష్టాపూర్ గ్రామం ఒక్కసారిగా మూగబోయింది. నిన్నటి దాకా బడికి వెళ్తూ ‘అన్నా’ అని పలకరించిన శివాని ఇక లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు” అని ఇరుగుపొరుగు కన్నీరు పెట్టుకున్నారు.  



ఒక్క హెచ్చరిక  
మంజీరా నదిలో ఇసుక తవ్వకాల వల్ల ఎక్కడ లోతు ఉంటుందో తెలియని పరిస్థితి. “దయచేసి నదిలోకి దిగకండి. పిల్లలను ఒంటరిగా పంపకండి” అని పోలీసులు వేడుకుంటున్నారు.  

ఒక క్షణం ఆనందం కోసం వెళ్లిన కుటుంబం, జీవితాంతం తీరని శోకాన్ని మిగిల్చింది. కందూరుకు వెళ్లిన ఆ అడుగులు, కన్నీటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

Post a Comment

Previous Post Next Post