జుక్కల్ ఎమ్మెల్యే ప్రజా దర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు
క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసిన ఎమ్మెల్యే
తెలంగాణ డైలీ న్యూస్, జుక్కల్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు పేర్కొన్నారు.
ప్రజలతో ముఖాముఖి
బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ప్రతీ నెల ప్రజా దర్బార్ నిర్వహించాలని కోరుతున్నారు.
అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు
ప్రజలు వినిపించిన సమస్యలను ఓర్పుగా ఆలకించిన ఎమ్మెల్యే, వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు.



Post a Comment