![]() |
| డి ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ను కలిసిన మల్లికార్జున్ |
కామారెడ్డి జిల్లాలో అధికారుల బదిలీలు, నూతన బాధ్యతలు
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
డీబీసీడీఓగా పి. నర్సయ్య, విద్యా శాఖ అధికారిగా ఎల్. మల్లిఖార్జున్ బాధ్యతలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బుధవారం పలువురు అధికారులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
డీబీసీడీఓగా బాధ్యతలు స్వీకరించిన పి. నర్సయ్య
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి (DBCDO)గా పి. నర్సయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
విద్యా శాఖ అధికారిగా ఎల్. మల్లిఖార్జున్
నూతన విద్యా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. మల్లిఖార్జున్ బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు.
బదిలీపై వెళ్తున్న డీఈఓ రాజుకు సన్మానంబదిలీపై వెళ్తున్న విద్యా శాఖ అధికారి రాజును బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ ప్రతినిధులు, విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment