కామారెడ్డిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీజేపీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు హాజరు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో పలుచోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. (వీడియో 👇)
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో వేడుకలు
అనంతరం కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు, బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




Post a Comment