Top News

Mala Maha Sabha | ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతోంది: అయ్యాల సంతోష్

చలో మాల సభ కరపత్రాలు ఆవిష్కరించిన మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్  

ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరుగుతోంది: అయ్యాల సంతోష్  

ఈ నెల 28న మెదక్‌లో భారీ సభ  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: హన్మాజిపేట్ గ్రామంలో శుక్రవారం చలో మాల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసినందువల్ల ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలో, విద్యా అవకాశాలలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్ వల్ల మాలలకు ఉద్యోగాలు మరియు విద్యా ఉపాధి అవకాశాలలో ఫలాలు అందకుండా పోతున్నాయని తెలిపారు.  

మాల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆదివారం రోజున మెదక్‌లో భారీ సభను నిర్వహిస్తున్నందున మాలలందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల మాల సంఘం గౌరవ అధ్యక్షులు పోతురాజు లింగం, కుంట సుధాకర్, కాంబ్లె మధు, జింక సురేష్, పోతురాజు గంగాధర్, పోతురాజు సాయిలు, గైని శ్రీనివాస్, గైని సురేష్, అజ్జిగ శివప్రసాద్, గైని గంగ విట్టల్, బ్యాగరి పెద్ద సాయిలు, తుకారం, నవీందర్, సుధాకర్, గైని సంతోష్, భాస్కర్, కుంట గంగ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post